1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. I'm going : Kerala girl commits suicide after missing online class

ఆన్‌లైన్ క్లాసులకు హాజరుకాలేక సూసైడ్ చేసుకున్న బాలిక

Kerala
ఆన్‌లైన్ క్లాసులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. తరగతిలో ఎపుడూ ఫస్ట్ వచ్చే ఆ బాలిక.. ఇపుడు తమ స్కూల్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతులకు హాజరయ్యే అవకాశం లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడింది. ఈ ఘటన కేరళ రాష్ట్రం జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాక్డౌన్ కారణంగా పలు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగిస్తున్నాయి. అయితే, ఇది పేద విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. పూట గడవడానికే ఇబ్బందులు పడే పేద విద్యార్థులు ఆన్‌లౌన్‌ క్లాసుల సౌకర్యాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. 
 
ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరుకావడానికి తన వద్ద టీవీ, స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో ఓ విద్యార్థిని (14) ఆత్మహత్య చేసుకుంది. ఆన్‌లైన్‌ తరగతులకు దూరమవుతున్నానన్న మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది ఆ బాలిక. అనంతరం వాలంచెరిలోని ఇంటి సమీపంలో ఆమె విగతజీవిగా కనపడింది. 
 
ఆమె మృతదేహం పక్కనే  కిరోసిన్ సీసా‌ కూడా ఉంది. పోలీసులు ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఆమె స్థానిక పాఠశాలలో  9 వ తరగతి చదువుతోందని తెలిపారు. తరగతిలో ఆ విద్యార్థిని ఎ‍ప్పుడూ ఫస్ట్‌ వచ్చేదని చెప్పారు. 
తర్వాతి కథనం
ముంబైకి మరో ముప్పు.. నిసర్గ తుఫాన్ దూసుకొస్తోంది.. 130 ఏళ్ల తర్వాత?