శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:37 IST)

లాక్‌డౌన్ ఎత్తేస్తే భారత్‌లో మరణ మృదంగం: శాస్త్రవేత్తల హెచ్చరిక

లాక్‌డౌన్ ఎత్తేస్తే భారత్‌లో కరోనా మరణాలు ఊహించని స్థితిలో పెరగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయని చెబుతున్నారు.

ఒకవేళ మే 3న లాక్‌డౌన్ ఎత్తేస్తే మే 19 నాటికి దేశంలో 38,220 కరోనా మరణాలు చోటుచేసుకుంటాయని వెల్లడించారు.

దాదాపు 5.35 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కావొచ్చని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌(జేఎన్‌సీఏఎ్‌సఆర్‌), బెంగళూరు ఐఐఎస్‌, ఐఐటీ బాంబే సంస్థలు ‘కొవిడ్‌-19 మెడ్‌ ఇన్వెంటరీ’ అనే సైంటిఫిక్‌ స్టాటిస్టికల్‌ మోడల్‌ను ఉపయోగించి ఈ అంచనాలను రూపొందించాయి.

మే నెల సగం పూర్తయ్యే సమయానికి దేశంలో 76 వేల ఐసీయూ బెడ్లు అవసరం పడొచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఇదే మోడల్‌ను బట్టి తాము రూపొందించిన అంచనాలు ఇటలీ, న్యూయార్క్‌కు దాదాపు సరిపోలాయని స్పష్టం చేసింది.