1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (10:17 IST)

మూత్రాశయంలో ఛార్జర్ వైర్.. దానిని ఎలా చొప్పించాడో తెలిస్తే?

Cable
శస్త్రచికిత్స చేసేటప్పుడు వైద్యులు పొరపాటున కత్తెరలు వుంచి పొట్టన కుట్టేసే సందర్భాలు వున్నాయి. అయితే అసోంలో తాజాగా ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మూత్రాశయం నుంచి మొబైల్ ఛార్జర్ కేబుల్‌ని బయటకు తీశారు వైద్యులు. ఈ విషయాన్ని ఓ వైద్యుడు తన ఫేస్‌బుక్‌ ద్వారా పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి గువాహటికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ స్థానిక ఆస్పత్రికి వెళ్లాడు. తాను పొరపాటున మొబైల్ ఛార్జర్ కేబుల్‌ను తిన్నట్లు వైద్యుడికి వివరించాడు. దీంతో మొదట అతనికి ఎండోస్కోపీ చేయగా.. అతని కడుపులో కేబుల్ కనిపించలేదన్నారు. అయితే ఎక్స్‌రే తీయడంతో అతని మూత్రాశయంలో ఛార్జర్ వైర్ చూసి షాక్ అయినట్లు పేర్కొన్నారు. 
 
వైద్యులను తప్పుదారి పట్టించేందుకు ఆ వ్యక్తి అబ్ధం చెప్పినట్లు వైద్యుడు తెలిపారు. తన పురుషాంగం ద్వారా కేబుల్ వైరస్‌ను చొప్పించుకున్నాడని తెలిపారు. అలాగే అతని మానసిక పరిస్థితిపై కూడా అనుమానాలున్నాయన్నారు. కాగా మొత్తానికి శస్త్ర చికిత్స చేసి కేబుల్‌ను బయటకు తీశామని ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థతి నిలకడగా ఉందని డాక్టర్ ఇస్లాం తెలిపారు.