శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (10:11 IST)

పెరిగిన విమాన టికెట్ల ధరలు

విమాన టికెట్ల ధరల కనిష్ఠ పరిమితిని 5 శాతం మేర పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి తెలిపారు.

అయితే విమాన టికెట్ల ధరల గరిష్ఠ పరిమితిని మాత్రం యథాతథంగా కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఏటీఎఫ్‌ ధరల పెరుగుదల కారణంగా దేశీయ విమాన టికెట్ల ధరల కనిష్ఠ, గరిష్ఠ ధరల పరిమితులను గత నెలలో కేంద్రం 10-30 శాతం పెంచిన విషయం తెలిసిందే.

గత ఏడాది మే నెలలో దేశీయ విమాన సర్వీసులను పునఃప్రారంభించిన సందర్భంగా విమాన ప్రయాణ సమయాన్ని బట్టి ఏడు శ్రేణులుగా వర్గీకరించి టికెట్ల ధరలపై పరిమితులు విధించారు.