ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (09:14 IST)

పెరిగిన ఉల్లి ధరలు

మొన్నటి వరకు సామాన్యులకు అందుబాటులో ఉన్న ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కిలోపై రూ.20కుపైగా పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత నెలలో కిలో ఉల్లి రూ.30 పలికేది. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.55కు అమ్ముతున్నారు.

గడచిన యాభై రోజుల వ్యవధిలో కిలోపై రూ.25 పెరిగింది. జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు మహారాష్ట్ర  నుంచి,  ఏప్రిల్‌ తరువాత కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలోని శంకరాపల్లి, సదాశివునిపేట, కర్నూలు, తదితర ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌ వ్యాపారులు ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటుంటారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో కిలో ఉల్లి రూ.33 నుంచి రూ.40 వరకు ధర పలుకుతోంది. రవాణా చార్జీలు, బస్తాల్లో ఉల్లి తరుగుదల, సంచుల ఖరీదు, కమీషన్‌ అన్ని కలుపు కొని హోల్‌సేల్‌ వ్యాపారులు కిలో ఉల్లిని 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. రిటైల్‌ వ్యాపారులు మరో ఐదు రూపాయలను కలుపుకొని కిలో రూ.55కు అమ్ముతున్నారు.