మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 మే 2020 (09:22 IST)

దేశంలో కరోనా వైరస్ విజృంభణ.. 24 గంటల్లో 3320 కొత్త కేసులు

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా కరోనా తీవ్రతపై కేంద్రం హెల్త్ బులిటెన్‌ని విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 3320 మందికి కరోనా సోకగా 95 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మహారాష్ట్ర, గుజరాత్‌లలో భారీగా కేసులు నమోదవుతూ వున్నాయి. 
 
ముఖ్యంగా యాక్టివ్ కేసులు 39,834 ఉన్నాయని కేంద్రం తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇకపోతే.. 17,847మంది కరోనా నుంచి బయటపడ్డాయి. మృతులు రెండు వేలకు చేరగా... మొత్తం ఇప్పటి వరకు 60,000 మందికి కరోనా సోకింది. మరణాల సంఖ్య 1981గా ఉంది.
 
మరోవైపు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో కరోనా కరతాళనృత్యం చేస్తోంది. ఇక్కడ కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ దాదాపు 150కు పైగా కేసులు కొత్తగా నమోదవుతున్నాయి. 
 
ఈ క్రమంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 155 కరోనా కేసులు నమోదయ్యా యి. వీటితో కలుపుకొని మొత్తం కేసులు 3,214కు చేరాయని వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 66 మంది ప్రాణాలు కోల్పోయారని, 1,387 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.