శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ప్రీతి వెంకటరమణ
Last Modified: శుక్రవారం, 8 మే 2020 (20:59 IST)

ప్రపంచ ప్రఖ్యాత పాప్ స్టార్‌కు కరోనా...

కరోనా బాధిత దేశాలలో ముందువరుసలో ఉన్న అమెరికాలో గత కొన్ని రోజులుగా పాప్ స్టార్ మడోన్నా ఆరోగ్యంపై చాలా రకాలుగా రూమర్లు వచ్చాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆమె కరోనా బారిన పడినట్లు, ఆరోగ్యం విషమించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మడోన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ రూమర్లపై క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేసారు.
 
పారిస్ పర్యటనలో ఉన్నప్పుడు నాకు కరోనా సోకింది. అప్పటి నుండి నేను పూర్తిగా క్వారంటైన్‌లో ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించడం వలన కరోనా మహమ్మారి నుండి ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాను. ఇటీవల చేసుకున్న కొన్ని పరీక్షల ప్రకారం నా శరీరంలో యాంటీబాడీస్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని పోస్ట్ చేసింది. 
 
గత వారం ఆమె ఒక పోస్ట్‌లో ఇక నేను స్వేచ్ఛగా విహరించవచ్చు, కారు అద్దాలు దించుకుని వెళ్లవచ్చు, సూర్యోదయాన్ని ఆస్వాదించవచ్చు అంటూ వ్యాఖ్యలు చేయడంతో కాస్త గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఈ తాజా పోస్ట్‌తో ఆమె కరోనాను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా వైరస్‌‌ను ఎదుర్కోవడానికి జరుగుతున్న పోరాటానికి, వ్యాక్సిన్ తయారీకి మడోన్నా తన మద్దతు తెలపడంతో పాటు సుమారు 8 బిలియన్ డాలర్ల నిధులను సేకరించారని వార్తలు వస్తున్నాయి.