శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 జనవరి 2023 (18:10 IST)

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పది పాసైతే చాలు.. ఇండియా పోస్టులో ఉద్యోగం..

Jobs
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియా పోస్టు నుంచి అతిపెద్ద నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా  40,889 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పాసైతే చాలు. 
 
ఈ రిక్రూట్‌మెంట్ కింద.. భారత పోస్టులో గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే వారు  indiapostgdsonline.gov.in అనే వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. 
 
జనవరి 27 నుంచి ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 16, 2023 వరకు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకునేందుకు చివరి తేదీ.  వయోపరిమితి విషయానికొస్తే.. ఈ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్లుగా నిర్ణయించారు.
 
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీకి వయో సడలింపు ఉంటుంది. ఈ ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక మెరిట్ ద్వారా జరుగుతుంది.