శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 జూన్ 2020 (14:48 IST)

చైనా విద్యుత్ పరికరాల్లో మాల్వేర్... కేంద్ర మంత్రి హెచ్చరిక

చైనా నుంచి దిగమతి చేసుకునే విద్యుత్ పరికరాలతో చాలా ప్రమాదం ఉందని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ హెచ్చరించారు. ఒక వేళ భారత్ - చైనా దేశాల మధ్య యుద్ధం ఉంటూ వస్తే ఆ విద్యుత్ పరికరాల్లో చైనా అనేక మాల్వేర్లు, ట్రోజన్ వైరస్‌లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. 
 
యుద్ధం అనివార్యమైన పక్షంలో చైనా ఈ విద్యుత్ పరికరాల్లో అమర్చిన మాల్వేర్లు, ట్రోజన్ వైరస్‌లను యాక్టివేట్ చేస్తుందని, దాంతో భారత్‌లోని విద్యుత్ గ్రిడ్ కుప్పకూలిపోతుందని ఆర్కే సింగ్ వివరించారు.
 
ఇప్పటికాలంలో విద్యుత్ రంగం కూడా ఎంతో వ్యూహాత్మక అంశంగా మారిందని, ఒక దేశంలోని కంపెనీలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్నీ విద్యుత్ రంగంపై ఆధారపడి ఉంటాయని గుర్తుచేసారు. అందుకే దేశంలోని విద్యుత్ రంగాన్ని దెబ్బతీసేందుకు శత్రుదేశం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.  
 
కానీ, భారత్ తన శత్రుదేశాలకు ఇలాంటి అవకాశం ఇవ్వబోదని, ఇలాంటి విపత్తును ఎదుర్కొనేందుకు ఫైర్ వాల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందుకోసం పూర్తిగా భారత్‌లో తయారైన పరికరాలే ఉపయోగిస్తామని మంత్రి ఆర్కే సింగ్ చెప్పుకొచ్చారు.