శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 11 ఆగస్టు 2020 (13:48 IST)

దేశంలో గాడిద పాల డెయిరీ.. ఒక లీటరు రూ.7వేలు

Donkey
దేశంలో గాడిద పాల డెయిరీ ప్రారంభం కాబోతోంది. హర్యానాలోని హిస్సార్‌లో ఉన్న నేషనల్ హార్స్ రీసర్చ్ సెంటర్‌లో ఈ డెయిరీని ఏర్పాటు చేయబోతున్నారు. దీని కోసం 10 హలారి జాతి గాడిదల కోసం ఆర్డర్ ఇచ్చారు. ఈ గాడిదలు గుజరాత్‌లో ఉంటాయి. వీటి పాలల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో గాడిద పాలు కీలక పాత్రను పోషిస్తాయి. చిన్న పిల్లలకు గాడిద పాలు ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో జబ్బులకు గాడిద పాలు ఔషధంగా పని చేస్తాయి.
 
హలారి గాడిదలకు చాలా డిమాండ్ ఉంది. వీటి పాల ధర లీటర్ కు రూ.7వేల వరకు ఉంటుంది. అలర్జీ, ఉబ్బసం, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధులపై పోరాడే రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ గాడిదల పాలు తోడ్పడతాయి.

ఈ నేపథ్యంలోనే గాడిద పాల డెయిరీని ఏర్పాటు చేయబోతున్నారు. తొలుత గాడిదల బ్రీడింగ్ జరుగుతుందని... ఆ తర్వాత డెయిరీ పనులు మొదలవుతాయని జాతీయ గుర్రాల పరిశోధన కేంద్రం తెలిపింది.