గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 మే 2017 (15:45 IST)

తమిళనాట రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ? సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా తలైవా!

తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకానుందా? అవుననే అంటున్నారు తమిళ సూపర్ స్టార్ అభిమానులు. హీరో రజనీకాంత్ రాజకీయాల్లో రావడం తథ్యమనే సంకేతాలు వస్తున్నాయి. ఇందులోభాగంగానే ఈనెల 15వ తేదీ నుంచి ఆయన తన అభి

తమిళనాడులో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకానుందా? అవుననే అంటున్నారు తమిళ సూపర్ స్టార్ అభిమానులు. హీరో రజనీకాంత్ రాజకీయాల్లో రావడం తథ్యమనే సంకేతాలు వస్తున్నాయి. ఇందులోభాగంగానే ఈనెల 15వ తేదీ నుంచి ఆయన తన అభిమానులతో జిల్లాల వారీగా సమావేశంకానున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. 
 
ఈనెల 15 నుంచి 19 వరకు అభిమానులతో రజనీ సమావేశం కానున్నారు. అభిమానులతో ఆయన గ్రూపులు, గ్రూపులుగా, విడివిడిగా కలవనున్నారు. సుమారు 8 ఏళ్ల తర్వాత రజనీకాంత్ అభిమానులతో సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత ఏం జరగనుంది. రజనీ పొలిటికల్ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా ఊహాగానాలు ఊగిసలాడుతున్నాయి. 
 
ఇంతకీ ఆయన రాజకీయరంగ ప్రవేశం చేస్తారా? రాజకీయంలోకి దిగేందుకు అభిమానుల అభిప్రాయాలు తీసుకుంటున్నారా? చెన్నైలో ఏం జరుగుతోంది. తలైవా రాజకీయాల్లోకి రావాలని ఎప్పటినుంచో అభిమానులు కోరుతున్నారు. అయితే అభిమానుల కోరికను రజనీ చాలా కాలంగా సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు. 
 
అయితే, అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా... రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. రాష్ట్రానికి సరైన దిశ నిర్దేశం చేసే రాజదకీయ నాయకత్వం కరువైంది. డీఎంకే అధినేత కరుణానిధి సైతం మంచానికే పరిమితమయ్యారు. 
 
ఈనేపథ్యంలో మరోసారి చూపు తలైవాపై పడింది. తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టి రాష్ట్రానికి నాయకుడివై నడిపించాలంటూ ఆయన అభిమానులు ఒత్తడి పెంచుతున్నారు. దీంతో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోమారు ఆసక్తికర చర్చకు తెరలేసింది.