శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (10:27 IST)

పీఎస్ఎల్వీ-సీ37తో ఇస్రో కొత్త రికార్డు.. ఏకకాలంలో 104 ఉపగ్రహాలు కక్ష్యలోకి.. సక్సెస్

ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే ఇస్రో నూతన అధ్యాయానికి తెరలేపింది. ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ఒకే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపింది. 104 ఉపగ్రహాల్లో అమెరికాకు

ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లోనే ఇస్రో నూతన అధ్యాయానికి తెరలేపింది. ముందెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను ఒకే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపింది. 104 ఉపగ్రహాల్లో అమెరికాకు చెందినవే 96 ఉన్నాయి. పీఎస్ఎల్వీ-సీ37 అనే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది. 
 
బుధవారం ఉదయం 9.28నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ37లోకి 104 ఉపగ్రహాలను తీసుకెళుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంతో 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశ పెట్టనుంది ఇస్రో. ప్రపంచంలో తొలిసారి ఇలాంటి చరిత్రాత్మక ప్రయోగానికి ఇస్రో తెరతీసింది.
 
పీఎస్ఎల్వీ-సీ37 మొత్తం 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యావర్తన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. 28.42 నిమిషాల్లో రాకెట్‌ నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించనుంది. ప్రయోగం ప్రారంభమైన తర్వాత 17.29 నిమిషాలకు కార్టోశాట్‌-2.. రాకెట్‌ నుంచి 510.383 కిలోమీటర్ల ఎత్తులో విడిపోనుంది.
 
ఐఎన్‌ఎస్‌-1ఏ 17.29 నిమిషాలకు, ఐఎన్‌ఎస్‌-1బి 17.40 నిమిషాలకు వాహక నౌక నుంచి విడిపోనున్నాయి. దీని తర్వాత 18.32 నిమిషాల నుంచి 28.42 నిమిషాల మధ్య విదేశీ ఉపగ్రహాలన్నీ 524 కిలోమీటర్ల ఎత్తులో రాకెట్‌ నుంచి విడిపోయేలా ఇస్రో శాస్త్రవేత్తలు వాహక నౌకను సిద్ధం చేశారు. 
 
ఈ ఉదయం 9:28 శ్రీహరికోట నుంచి ప్రయోగించబడ్డ పీఎస్ఎల్వీ సీ-37 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లి, తనతో పాటు తీసుకెళ్లిన 104 ఉపగ్రహాలనూ విజయవంతంగా వాటి వాటి కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఇస్రో అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగం సూపర్ సక్సెస్ అయిందని తెలిపారు. మొత్తం 524 కిలోమీటర్ల దూరాన్ని 22 నిమిషాల్లో ప్రయాణించిన రాకెట్ అన్ని ఉపగ్రహాలను విడిచిందని, వాటి నుంచి భూమిపై వివిధ ప్రాంతాల్లో ఉన్న సెంటర్లకు సిగ్నల్స్ అందుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం విజయంతో శాస్తరవేత్తలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.