శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (09:30 IST)

శశికళను వీడని ఐటీ శాఖ.. కోట్లాది రూపాయల ఆస్తుల అటాచ్

అక్రమాస్తుల కేసులో జైలు పాలైన అన్నాడీఎంకే మాజీ నాయకురాలు శశికళను ఐటీ శాఖ వదలడం లేదు. ఆమెకు చెందిన రూ.300 కోట్లు, ఖరీదైన 65 ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది.

పోయస్‌గార్డెన్ దగ్గర ఉన్న 10 అంతస్తుల భవనాన్ని కూడా ఐటీశాఖ అటాచ్ చేసింది. షెల్ కంపెనీలతో శశికళ ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన అధికారులు ఆస్తులను అటాచ్ చేశారు.

బెంగళూరు జైలులో ఉన్న శశికళకు ఐటీశాఖ ఇప్పటికే ఇందుకు సంబంధించిన నోటీసులు పంపింది. 2017లో అక్రమాస్తుల కేసులో శశికళకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే.