శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 9 నవంబరు 2017 (18:06 IST)

జయ గ్రూప్స్ పైన ఐటీ దాడులు కేంద్రం చలవే... వెనుక పళనిస్వామి వున్నారా?

తమిళనాడు రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఒకటిరెండు కాదు ఏకంగా 187 ప్రాంతాల్లో జయ గ్రూప్స్‌కు సంబంధించిన కార్యాలయాలకు చెందిన శాఖాల్లో ఐటి శాఖ అధికారులు దాడులు. ఉదయం 5.30 గంటల నుంచే దాడులు ప్రారంభమయ్యాయి. జయలలిత మరణం తరువాత ఆమెకు సంబంధించిన కార్యా

తమిళనాడు రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఒకటిరెండు కాదు ఏకంగా 187 ప్రాంతాల్లో జయ గ్రూప్స్‌కు సంబంధించిన కార్యాలయాలకు చెందిన శాఖాల్లో ఐటి శాఖ అధికారులు దాడులు. ఉదయం 5.30 గంటల నుంచే దాడులు ప్రారంభమయ్యాయి. జయలలిత మరణం తరువాత ఆమెకు సంబంధించిన కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేయడం ఇదే ప్రధమం. 
 
జయ మరణం తరువాత జయ టివి బాధ్యతలు మొత్తాన్ని శశికళ కుమార్తె ఇళవరసి కొడుకు వివేక్ చూస్తున్నాడు. అలాగే జయలలితకు సంబంధించి కొన్ని సినిమా థియేటర్ల కూడా ఉన్నాయి. దీంతో పాటు జయ టివికి సంబంధించిన పత్రిక, శశికళ మేనల్లుడు దినకరన్, శశికళ బంధువుల ఇళ్ళలోను ఏకకాలంలో సోదాలు కొనసాగాయి. 
 
ఈ దాడులు మొత్తానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనన్నది దినకరన్ తరపు న్యాయవాది వెంకటేష్‌ ఆరోపణ. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోది డిఎంకే పార్టీ నేతలను కలిసి వెళ్ళడం.. అన్నాడిఎంకే పార్టీని లేకుండా చేయాలన్న ఆలోచనలో మోదీ ఉండటం వల్ల మొదటగా తమపైన ఐటి శాఖ అధికారులతో దాడులు చేయించారంటున్నారు న్యాయవాది. జయలలిత మరణించి చాలాకాలం అయిన తరువాత ఇప్పుడు ఐటీ శాఖ అధికారులు దాడులు చేయడం వెనుక పళణిస్వామి హస్తం కూడా ఉందేమోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.