మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 25 సెప్టెంబరు 2017 (14:44 IST)

తమిళనాడు సిఎం 24/7 నిద్రపోతున్నారా... నిప్పులు చెరిగిన కమల్ హాసన్

తమిళనాడు ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు విశ్వనటుడు కమల్ హాసన్. ముఖ్యమంత్రి పళణిస్వామి పైనే నిప్పులు చెరిగారాయన. తమిళనాడులో విష జ్వరాలు ప్రబలుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. జ్వరాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తమిళనాడు సి

తమిళనాడు ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు విశ్వనటుడు కమల్ హాసన్. ముఖ్యమంత్రి పళణిస్వామి పైనే నిప్పులు చెరిగారాయన. తమిళనాడులో విష జ్వరాలు ప్రబలుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. జ్వరాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే తమిళనాడు సిఎం 24/7 నిద్రపోతున్నాడా అని ప్రశ్నించారు. 
 
గత కొన్నినెలలుగా తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో విషజ్వారాలు ప్రబలుతున్నాయి. డెంగ్యూ, మలేరియాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే మరణిస్తున్నారు కూడా. అయినా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. ఈ విషయాన్ని గమనించిన కమల్ ప్రభుత్వంపై ఊగిపోయారు. 
 
పళణి స్వామి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు... ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కమల్ రాజకీయాల్లోకి రానుండటంతో ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.