గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మే 2023 (08:31 IST)

జమ్మూ కాశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు: ఉగ్రవాది హతం

indian army
జమ్మూ కాశ్మీర్‌లో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. శనివారం రాజౌరి, బారాముల్లాలో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతం అయ్యాడు. రాజౌరిలో ఇప్పటికే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది హతమైనట్లు అధికారులు తెలిపారు. 
 
రాజౌరిలోని కంది అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఐదుగురు సైనికులు మరణించారు. జమ్మూ ప్రాంతంలో ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల బృందాన్ని ఏరివేసేందుకు భారత సైన్యం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి.