బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (09:51 IST)

జల్లికట్టుపై దిగొచ్చిన కేంద్ర సర్కారు .. చట్టసవరణ

తమిళ సంప్రదాయ సాహస క్రీడా పోటీ అయిన జల్లికట్టు నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయంతో జల్లికట్టు పోటీల నిర్వహణకు సానుకూల వాతావరణం ఏర్పడింది.

తమిళ సంప్రదాయ సాహస క్రీడా పోటీ అయిన జల్లికట్టు నిర్వహణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్రం తీసుకున్న సంచలన నిర్ణయంతో జల్లికట్టు పోటీల నిర్వహణకు సానుకూల వాతావరణం ఏర్పడింది. 
 
జల్లికట్టు పోటీల పేరుతో మూగ జీవులను చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ పెటా సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో జల్లికట్టు పోటీలపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఈ నిషేధాన్ని ఎత్తవేయాలని కోరుతూ తమిళనాడువ్యాప్తంగా గత యేడాది ఆందోళనలు జరిగాయి. దీంతో కేంద్రం దిగివచ్చింది. 1960 జంతుహింస చట్టాన్ని సవరించింది.
 
కేంద్రం నిర్ణయంతో జల్లికట్టు నిర్వాహకుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జల్లికట్టుకు సిద్ధమవుతున్నారు. అయితే సంక్రాంతికి ముందే వచ్చే నెల 7న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. అయితే, కేంద్రం తీరుపై జంతు పరిరక్షణ సంఘం పెటా మరోమారు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం లేకపోలేదు.