కోడిగుడ్లు పగిలాయనీ భార్య తలను గోడకేసి బాది చంపాడు...
కోడిగుడ్లు పగిలాయనీ భార్య తలను గోడకేసి బాదిచంపిన ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
కోడిగుడ్లు పగిలాయనీ భార్య తలను గోడకేసి బాదిచంపిన ఘటన ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని తిరుప్పూరు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
జిల్లాలోని గాంగేయం సమీప కడైయూర్ గ్రామంలో బీహార్ రాష్ట్రానికి చెందిన సికిందర్ (25), రూనాదేవి (21) దంపతులు వలస వచ్చి జీవిస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, ఆదివారం రాత్రి ఆమ్లేట్ వేయాలని భార్యను కోరాడు. ఇందుకోసం అవసరమైన కోడి గుడ్లు కూడా కొకొనుగోలు చేసి తెచ్చి ఇచ్చాడు.
అయితే, ఆ సమయానికి వంట గదిలోకి వచ్చిన కుమారుడు ఆ గుడ్లను కింద పడవేయడంతో అవి పగిలిపోయాయి. దీంతో దంపతుల మధ్య గొడవ జరిగింది. భార్య నిర్లక్ష్యం కారణంగానే గుడ్లు పగిలాయని ఆగ్రహించిన సికిందర్, ఆమె తలను పట్టుకుని గోడకేసి బాదాడు.
ఆమె కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని గాయపడిన రునాదేవిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గం మధ్యంలో మృతిచెందింది. ఈ ఘటనపై ఇంటి యజమాని మణి ఫిర్యాదుతో గాంగేయం పోలీసులు కేసు నమోదుచేసుకొని, సికిందర్‌ను అరెస్ట్ చేశారు. ఇటు తల్లి మృతి చెంది, తండ్రి జైలుపాలుకావడంతో రెండున్నరేళ్ల బాలుడు అనాథగా మారాడు.