శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 18 జనవరి 2017 (19:53 IST)

కరెంటు తీసినా కసితో కుర్రాళ్లు... మెరీనా తీరంలో 6 గంటల తర్వాత ఇదీ సంగతి...(ఫోటోలు)

జల్లికట్టు క్రీడపై వున్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలంటూ విద్యార్థులు, ప్రజలు చెన్నై మెరీనా బీచ్ తీరంలో ఆందోళన చేస్తున్నారు. ఉదయం ప్రారంభమయిన ఈ ఆందోళనను విరమించేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగి తను

జల్లికట్టు క్రీడపై వున్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలంటూ విద్యార్థులు, ప్రజలు చెన్నై మెరీనా బీచ్ తీరంలో ఆందోళన చేస్తున్నారు. ఉదయం ప్రారంభమయిన ఈ ఆందోళనను విరమించేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. చివరికి ముఖ్యమంత్రి సైతం రంగంలోకి దిగి తను గురువారం నాడు నేరుగా విషయాన్ని ప్రధాని మోదీతో మాట్లాడి ఆర్డినెన్స్ జారీ అయ్యే విధంగా చూస్తానని చెప్పినా వారు వినడంలేదు. దీనితో చెన్నై మెరీనా తీరంలో విద్యుత్ నిలుపుదల చేశారు. ఫలితంగా అక్కడంతా చీకట్లు కమ్ముకున్నాయి. కానీ విద్యార్థులు మాత్రం అక్కడి నుంచి కదలడంలేదు. తమ వద్ద వున్న సెల్ ఫోన్లు బయటకు తీసి టార్చ్ వేసి ఆందోళన చేస్తున్నారు. చూడండి ఆ ఫోటోలను...