గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (14:06 IST)

జయలలిత నాకు సోదరి.. ఆమె ఆస్తిలో వాటా ఇవ్వాలి.. మైసూరు కోర్టుకు పిటిషన్

Jayalalitha
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిలో వాటా ఇవ్వాలని 83 ఏళ్ల వృద్ధుడు మైసూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌లను న్యాయస్థానం ఇప్పటికే ఆమె వారసులుగా ప్రకటించింది. దీంతో బోయస్ గార్డెన్ హౌస్ సహా జయలలిత ఆస్తులపై చట్టబద్ధమైన హక్కు ఉందని సంబరాలు చేసుకున్నారు. 
 
ఈ స్థితిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తిలో వాటా కోరుతూ 83 ఏళ్ల వాసుదేవన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయలలిత తన తండ్రి జయరామ్ రెండో భార్య కుమార్తె అని, జయలలిత తనకు సోదరి అని.. అందుకే అతని ఆస్తిలో తనకు 50శాతం వాటా కావాలని మైసూరుకు చెందిన వ్యక్తి వాదించారు. ఈ కేసు త్వరలో విచారణకు రానుంది.