బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (10:05 IST)

జయలలిత అంత్యక్రియలు.. చెన్నైకి ప్రధాని మోడీ.. రాహుల్ గాంధీ..

తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు హౌస్‌లో ఉదయం బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన మోడీ 9.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి చెన్నై చేరుకోనున్నారు

తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియలకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఢిల్లీలోని పార్లమెంటు హౌస్‌లో ఉదయం బాబాసాహెబ్ అంబేద్కర్‌కు నివాళులర్పించిన మోడీ 9.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి చెన్నై చేరుకోనున్నారు. అనంతరం జయలలిత పార్ధివదేహానికి నివాళులర్పిస్తారు. సాయంత్రం జరిగే అంత్యక్రియల్లో పాల్గొంటారు. 
 
మెరీనా బీచ్‌లో ఎంజీఆర్ సమాధి పక్కనే జయలలిత అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. కాగా, జయలలిత పార్థివదేహానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం చెన్నైకి వస్తున్నారు. వీరితో పాటు 20 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రముఖులు, కేంద్ర మంత్రులు అమ్మ పార్థీవ దేహానికి నివాళులు అర్పించేందుకు తరలి వస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి గా పన్నీర్‌సెల్వం నియమితులయ్యారు. తన జేబులో అమ్మ జయలలిత ఫొటో పెట్టుకుని మరీ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఇక పార్టీ నాయకత్వ బాధ్యతలను జయలలిత నెచ్చెలి శశికళకు అప్పగించాలని పార్టీ ఉన్నతస్థాయి సమావేశం నిర్ణయించింది. దీనిపై కొంత అసంతృప్తి వ్యక్తమైనా, చివరకు పార్టీ పగ్గాలను ఆమెకే అప్పగించారు.
 
ఓ పన్నీర్ సెల్వం (65) జయలలితకు అత్యంత విధేయుడు. గతంలో ఆమె జైలుకు వెళ్లినప్పుడు కూడా ఆయననే ముఖ్యమంత్రిగా నియమించినా, అప్పట్లో అమ్మ ఫొటోను మాత్రమే కుర్చీలో ఉంచి తాను విడిగా కూర్చుని కేబినెట్ సమావేశం నిర్వహించారు.