1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (00:50 IST)

అమ్మకేంకాదు.. కోలుకుంటారు.. అన్నాడీఎంకే నేతలు.. జయ వెంటే యావత్తు భారత దేశం.. మోడీ

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. సెప్టెంబర్ నెలలో డీహైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయిన జయలలిత ఆరోగ్యంపై రోజుకో వార్త పుట్టుకొచ్చింది. అమ్మ కోలుకున్నారని కొ

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. సెప్టెంబర్ నెలలో డీహైడ్రేషన్ కారణంగా ఆస్పత్రిలో అడ్మిట్ అయిన జయలలిత ఆరోగ్యంపై రోజుకో వార్త పుట్టుకొచ్చింది. అమ్మ కోలుకున్నారని కొందరు.. అమ్మ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని కొందరు చెప్తుండేవారు.

ఇటీవలే అమ్మ పూర్తిగా కోలుకున్నారని ఆమె పూర్తిగ కోలుకున్నారని అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. ఆమె ఎప్పుడనుకుంటే అప్పుడు డిశ్చార్జ్ కావొచ్చునని వ్యాఖ్యానించారు. అయితే ఉన్నట్టుండి ఆదివారం జయలలితకు గుండెపోటు వచ్చిందని అపోలో ప్రకటించడం ద్వారా అమ్మ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. 
 
ఆదివారం అమ్మకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని వార్తలు రావడంతో ఇన్నాళ్ళు అమ్మ కోలుకోవాలని చేసిన ప్రార్థనలు, పూజలు ఏమయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అమ్మ ఆరోగ్యంపై మాత్రం అన్నాడీఎంకే క్యాడర్ నమ్మకంతో ఉంది. ఆమె త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని.. ఆమె ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండబోదని గట్టిగా నమ్ముతున్నారు. 
 
కాగా 68 ఏళ్ల జయలలితకు విదేశాల నుంచి వైద్యులు అపోలోకు వచ్చి వైద్యం అందించారు. చికిత్స చేయించారు. అలాగే సింగపూర్ నుంచి రోబోలు కూడా అమ్మకు ఫిజియో చికిత్స ఇప్పించేందుకు చెన్నైకి వచ్చాయి. కానీ ఉన్నట్టుండి ఆమెకు గుండెపోటు రావడంపై ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు డీలా పడిపోయారు. ఇదిలా ఉంటే.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళ సీఎం జయలలిత గుండెపోటు వార్తపై స్పందించారు. యావత్తు భారత దేశం జయలలిత వెంటే ఉందని.. ఆమె వేగంగా కోలుకోవాలని మోడీ ఆశించారు.