సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 మే 2024 (14:43 IST)

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

Shiva Kanthanneni, Priya Hegde
Shiva Kanthanneni, Priya Hegde
"అక్కడొకడుంటాడు, మధురపూడి గ్రామం అనే నేను, రాఘవరెడ్డి" చిత్రాలతో రివార్డులు, అవార్డులు దండిగా పొందిన బహుముఖ ప్రతిభాశాలి శివ కంఠంనేని టైటిల్ పాత్రలో దర్శక సంచలనం గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన "బిగ్ బ్రదర్" ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి-రిలీజ్ వేడుక నిర్వహించి, చిత్ర విజయంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేసింది. 
 
Shiva Kanthanneni, murali mohan, ashock kumar and others
Shiva Kanthanneni, murali mohan, ashock kumar and others
ఈ వేడుకలో హీరో శివ కంఠంనేని, నిర్మాత ఆర్.వెంకటేశ్వరరావు, దర్శకులు గోసంగి సుబ్బారావు, చిత్ర సమర్పకులు జి.రాంబాబు యాదవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాసరావు, ఈ చిత్రంలో నటించిన గుండు సుదర్శన్, రాజేంద్ర, ప్రముఖ నటులు మురళీమోహన్, అశోక్ కుమార్, నిర్మాతల మండలి అధ్యక్షులు దామోదర్ ప్రసాద్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు పాల్గొన్నారు!!
 
తెలుగులో పలు చిత్రాలు రూపొందించి భోజపురిలో వరుస విజయాలతో దూసుకుపోతున్న గోసంగి సుబ్బారావు రీ-ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన "బిగ్ బ్రదర్"లో సక్సెస్ కళ పుష్కలంగా కనబడుతోందని, హీరో శివ కంఠంనేని ఈ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మురళీమోహన్ పేర్కొన్నారు. "బిగ్ బ్రదర్" లాంటి చిన్న సినిమాల విజయమే చిత్ర పరిశ్రమకు శ్రీరామరక్ష అని దామోదర్ ప్రసాద్, అశోక్ కుమార్ అన్నారు. తను నటించే ప్రతి చిత్రంలో అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ తో నటుడిగా అద్భుతంగా రాణిస్తున్న శివ కంఠంనేని "బిగ్ బ్రదర్"తో మరింత గుర్తింపు పొందాలని, "బింబిసార" చిత్రానికి ఫైట్స్ డిజైన్ చేసిన రామకృష్ణ "బిగ్ బ్రదర్"కి రూపకల్పన చేసిన పోరాటాలు ప్రత్యేక ఆకర్షణ అని ప్రభు పేర్కొన్నారు. 
 
"ప్లానింగ్ కి పెట్టింది పేరైన గోసంగి సుబ్బారావు తెలుగులో రీ-ఎంట్రీ ఇస్తూ తెరకెక్కించిన "బిగ్ బ్రదర్"లో టైటిల్ రోల్ ప్లే చేయడం గర్వంగా ఉందని" హీరో శివ కంఠంనేని అన్నారు. "యాక్షన్ ఎంటర్టైనర్స్ ను ఇష్టపడేవారిని బిగ్ బ్రదర్ చక్కగా అలరిస్తుందని, ఈనెల 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో "బిగ్ బ్రదర్"ను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నామని" నిర్మాత ఆర్.వెంకటేశ్వరరావు, సమర్పకులు జి.రాంబాబు యాదవ్ తెలిపారు. ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల విశ్వ కార్తికేయ, గుండు సుదర్శన్, రాజేంద్ర సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర దర్శకులు గోసంగి సుబ్బారావు మాట్లాడుతూ... "అనుకోకుండా భోజపురి పరిశ్రమకు వెళ్లి, ఇప్పటికి 15 సినిమాలు చేశాను. అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. చాలా రోజుల తర్వాత తెలుగులో "బిగ్ బ్రదర్"తో రీ ఎంట్రీ ఇస్తుండడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఇకపై వరసగా తెలుగులో పాన్ ఇండియా సినిమాలు చేస్తాను" అన్నారు. 
 
లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై జి.రాంబాబు యాదవ్ సమర్పణలో కె. శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు "బిగ్ బ్రదర్" చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఘంటా శ్రీనివాసరావు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో శివ కంఠంనేని సరసన ప్రియా హెగ్డే నటించగా... శ్రీ సూర్య, ప్రీతి శుక్లా ఇంకో జంటగా నటించారు. 
 
గౌతంరాజు, గుండు సుదర్శన్, రాజేందర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఒ: ధీరజ్-అప్పాజీ, డాన్స్: రాజు పైడి, స్టంట్స్: రామకృష్ణ, ఎడిటింగ్: సంతోష్, కెమెరా: ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఘంటా శ్రీనివాసరావు, సమర్పణ: జి.రాంబాబు యాదవ్, నిర్మాతలు: కె.శివశంకర్ రావు - ఆర్.వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం: గోసంగి సుబ్బారావు.