1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 20 మే 2024 (14:28 IST)

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

Manoj Manchu - Mirai
Manoj Manchu - Mirai
మనోజ్ మంచు ఎనిమిదేళ్ల విరామం తర్వాత వెండితెరపై మ్యాసీవ్ గా కమ్ బ్యాక్ ఇస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'మిరాయ్‌'లో తన లేటెస్ట్ అవతార్‌తో సూపర్ హీరో యూనివర్స్ ని 'ది బ్లాక్ స్వోర్డ్'గా రిడిఫైన్ చేశారు. తేజ సజ్జా ది సూపర్ యోధగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై TG విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు.
 
మనోజ్ మంచు పుట్టినరోజు సందర్భంగా గ్రాండ్ రివీల్‌లో, మేకర్స్ మంచు మనోజ్ ది బ్లాక్ స్వోర్డ్‌గా ఫస్ట్ లుక్ గ్లింప్‌ను లాంచ్ చేశారు. ఈ గ్లింప్స్ లో మంచు మనోజ్‌ను మునుపెన్నడూ చూడని ఇంటెన్స్, పవర్ ఫుల్ అవతార్‌లో కనిపించారు, ఒక స్ట్రెంజ్ వెపన్ తో ఊచకోత కోయడం నెక్స్ట్ లెవల్ లో వుంది. తన కమాండింగ్ ప్రజెన్స్, అతని పాత్ర బలం, బ్లాక్ స్వోర్డ్‌గా కథనంలో ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.  పోనీటైల్, స్టైలిష్ గడ్డంతో పొడవాటి జుట్టుతో, మనోజ్ పరిచయ సన్నివేశంలో లాంగ్ కోట్‌లో డెడ్లీగా, అదే సమయంలో అల్ట్రా-ఫ్యాషన్‌గా కనిపించారు. ఆ తర్వాత టీ-షర్ట్‌తో బ్లేజర్‌లో మరొక యాక్షన్-ప్యాక్డ్ సీక్వెన్స్ వచ్చింది. ఈ పాత్ర చిత్రానికి కొత్త కోణాన్ని జోడించి, నటుడిగా అతని వెర్సటాలిటీ, అంకితభావాన్ని చూపించింది. అతని పాత్ర యొక్క ప్రయాణం ప్రేక్షకులని లీనం చేస్తూ, సినిమా మొత్తం ప్రభావాన్ని పెంచుతుంది.
 
‘‘ఇంతటి పవర్‌ఫుల్, ఇంట్రస్టింగ్ క్యారెక్టర్‌తో మళ్లీ ఇండస్ట్రీకి రావడం చాలెంజింగ్‌గానూ, ఎగ్జైటింగ్‌గానూ ఉంది’’ అని రాకింగ్ స్టార్ మనోజ్ మంచు అన్నారు. "బ్లాక్ స్వోర్డ్  అనేది ప్రతి హీరోకి ఉండాల్సిన బలాన్ని ప్రతిధ్వనించే పాత్ర. నా కమ్ బ్యాక్ కోసం ఓపికగా ఎదురుచూస్తున్న నా అభిమానులతో ఈ ప్రయాణాన్ని పంచుకోవడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను." అన్నారు
 
మిరాయ్  విజువల్ గా అద్భుతమైన, నెరటివ్ -రిచ్ వరల్డ్ నేపథ్యంలో సెట్ చేయబడిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకర్షించే హీరోయిక్స్, ఆధునిక కథా కథనాలను మిళితం చేస్తుందని హామీ ఇచ్చింది. ఇది అశోకుని 9 పుస్తకాల రహస్యాలను అన్వేషిస్తుంది. చరిత్ర, పురాణాలతో కూడిన  ఒక ఎపిక్ కథగా వుండబోతుంది.
 
ది బ్లాక్ స్వోర్డ్  లాంచ్ ఈవెంట్ లో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు మాట్లాడుతూ.. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత మళ్ళీ వెడితెరకి వస్తున్నాను. సోషల్ మీడియా ద్వారా, ఏవైనా వేడుకల ద్వారా ఇన్నాళ్ళు ఎదో రూపంలో మీకు దగ్గరగా ఉంటున్నాను. కానీ సినిమా అనేదే ప్రధానం. సినిమా అనేదే అమ్మ. మీరంతా ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది సినిమా వల్లే. ఎప్పుడూ ఏదైనా కొత్తగా డిఫరెంట్ గా చేయాలనేది నా ప్రయత్నం. కేవలం డబ్బు కోసమే కాకుండా కథ నచ్చి పాత్ర నచ్చిన సినిమాలనే వెతుక్కుంటూ వెళ్లాను. మళ్ళీ సినిమాలు చేయాలనుకున్నప్పుడు చాలా కథలు విన్నాను. ఓపికగా ఎదురుచూశాను. ఇలాంటి సమయంలో దర్శకుడు కార్తిక్ నా జీవితంలోకి వచ్చారు. ముందుగా తేజ సజ్జాకి థాంక్స్ చెప్పాలి . 'ఈ సినిమాలో నివ్వు నేను చేయాలి అన్న. కథ వినాలి' అని చెప్పడం జరిగింది. ఇది అదిరిపోయే స్క్రిప్ట్. ఇది రెండు పార్టులుగా వస్తుంది. తొలి పార్ట్ ఏప్రిల్ 18,2025 లో వస్తుంది. అశోకుని తొమ్మిది రహస్య పుస్తకాల గురించిన అద్భుతమైన కథ ఇది. ప్రతిఒక్కరూ ఈ కథ తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. దర్శకుడు అద్భుతంగా తీశాడు, మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు అందరూ ఇరగదీశారు. నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, మిరాయ్ టీం అందరికీ ధన్యవాదాలు. ఇది జస్ట్ గ్లింప్స్ మాత్రమే. మిత్రుడు తారక్ పుట్టినరోజు శుభాకాంక్షలు. నా బర్త్ డే సందర్భంగా భక్త కన్నప్ప టీం కూడా టీజర్ లాంచ్ చేస్తున్నారు. అన్నకి, టీంకి ఆల్ ది బెస్ట్. సిరివెన్నెల గారి పుట్టిన రోజు కూడా ఈ రోజే. ఆయన్ని చాలా మిస్ అవుతున్నాను. ఆయన చల్లని దీవెనలు మాపై వుండాలని కోరుకుంటున్నాను. అందరికీ శివుని ఆశీస్సులు వుండాలి. అందరికీ ధన్యవాదాలు. వందేమాతరం.' అన్నారు
 
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. సినిమాల గురించి తెలుసుకుంటున్న రోజుల్లో ఎక్కువగా మనోజ్ అన్న సినిమాలే చూశాను.  మిరాయ్ లో మనోజ్ అన్న భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే మనోజ్ అన్న. వెల్ కమ్ బ్యాక్ టు సినిమా' అన్నారు.
 
ఇప్పటికే విడుదలైన  సూపర్ హీరో తేజ సజ్జ గ్లింప్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు రాకింగ్ స్టార్ మనోజ్ మంచు అతని పుట్టినరోజున వంతు వచ్చింది. అతను కేవలం కమ్ బ్యాక్ మాత్రమే కాదు; తెలుగు చలనచిత్ర పరిశ్రమ, బౌండరీలని దాటి ప్రతిధ్వనించే స్టేట్మెంట్.
 
ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయిక. డైలాగ్స్ అందిస్తున్న మణిబాబు కరణంతో కలసి కార్తీక్ ఘట్టమనేని స్క్రీన్ ప్లే రాశారు. గౌర హర సంగీత దర్శకుడు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నాగేంద్ర తంగాల కాగా, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల. కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కాగా, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
 
మిరాయ్ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ,  మలయాళం భాషలలో ఏప్రిల్ 18న వేసవిలో 2D, 3D వెర్షన్లలో విడుదల కానుంది.