శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (20:13 IST)

హనుమాన్ బృందానికి అమిత్‌షా శుభాకాంక్షలు

AmitShah - prashant varma - tej sajja
AmitShah - prashant varma - tej sajja
తేజ్ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా దేశమంతా పేరు తెచ్చకుంది. నిరంజన్ రెడ్డి నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. ఇటీవలే యాభై రోజుల వేడుకను కూడా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో జరుపుకుంది. కాగా, నేడు బిజెపి కీలక నేత అమిత్‌షా హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర టీమ్ ఆయన్ను గౌరవపూర్వకంగా కలిసింది. 
 
hanuman team with AmitShah
hanuman team with AmitShah
దర్శకుడు మాట్లాడుతూ,  హనుమాన్ చారిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందనలు మరియు ఆశీర్వాదం కోసం భారత హోం వ్యవహారాల గౌరవనీయ మంత్రి అమిత్‌షా ను కలిశాం. ఆయన ఇచ్చిన సలహాలతో మరో సినిమా తీయడానికి స్పూర్తి కలిగింది. త్వరలో సీక్వెల్ చేయబోతున్నానని పేర్కొన్నారు.