సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 2 మార్చి 2024 (17:13 IST)

జై హనుమాన్ తో ప్రేక్షకులు రుణాన్ని తీర్చుకోబోతున్నాను: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

Prashant Varma - Teja Sajja - K Niranjan Reddy
Prashant Varma - Teja Sajja - K Niranjan Reddy
సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైన *'హనుమాన్' చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి, సక్సెస్ ఫుల్ గా 50 రోజులని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్  హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ కు హనుమాన్ ప్రతిమలను జ్ఞాపికలుగా అందించారు మేకర్స్.
 
 ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. 50 రోజుల పండగ చూసి చాలా కాలమైయింది. అది హనుమాన్ సినిమాకి జరగడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి పని చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. ఒక సక్సెస్ ఫుల్ సినిమా చాలా మంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, పంపిణీదారులు, థియేటర్స్ ఇలా చాలా మంది జీవితాలని మారుస్తుంది. అది సెలెబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. హనుమాన్ లాంటి సినిమా 50 రోజులు 150 థియేటర్స్ లో నడిచిందనేది చాలా మందికి నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ వేడుక చాలా ముఖ్యం. నా మొదటి 'అ'. నాని గారు నిర్మించారు. ఆ సినిమా క్రిటికల్ గా చాలా పేరు వచ్చింది. కమర్షియల్ గా మంచి హిట్ అయ్యింది. అయితే సక్సెస్ ని సక్సెస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుకదా అని సక్సెస్ ఈవెంట్ చేయలేదు. సక్సెస్ ఈవెంట్ చేయలేదు కాబట్టి ఆ సినిమా కమర్శియల్ హిట్ కాలేదేమో అని చాలా మంది అనుకున్నారు. అందుకే సక్సెస్ ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం, ఒక జెన్యూన్ హిట్ అనేది చాలా ముఖ్యం. ఇలాంటి వేడుకలో అంతా పాల్గోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. సినిమాని ఆదరించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. 
 
రీమాస్టర్డ్ వెర్షన్ వస్తోంది. అది మీకు ఇంకా సర్ప్రైజ్ చేయబోతుంది.  ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోయే సినిమాలకు హనుమాన్ విజయం గట్టిపునాది వేసింది. ప్రేక్షకులని అలరించే క్యాలిటీ సినిమాలు మా యూనివర్స్ నుంచి రెడీ చేస్తున్నాం.  హనుమాన్ ఇంటర్నేషనల్ రిలీజ్ కూడా త్వరలో జరగబోతుంది. హనుమాన్ ప్రపంచదేశాల్లో కూడా మన తెలుగు సినిమా గొప్పదదాన్ని చాటబోతుంది. దీనికి కారణం మా నిర్మాత విజన్. నిరంజన్ గారికి థాంక్స్. హనుమాన్ 50 రోజుల అనేది ఒక స్టెప్ మాత్రమే. ఈ సినిమాతో ఇంకెన్నో స్టెప్స్ ఎక్కబోతున్నాం. ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సినిమాని సబ్మిట్ చేయబోతున్నాం. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అవార్డ్స్ వస్తాయనే నమ్మకం వుంది. జై హనుమాన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. అతి త్వరలో దాని ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నాం. హనుమాన్ లో చివరి ఐదు నిమిషాలు ఎలా విపరీతంగా నచ్చిందో జై హనుమాన్ లో అది సినిమా అంతా ఉండబోతుంది. మీరు ఇచ్చిన ఈ సక్సెస్ ని భాద్యతగా తీసుకొని మీ రుణాన్ని జైహనుమాన్ తో తీర్చుకోబోతున్నాను. జై శ్రీరామ్.. జై హనుమాన్.. జై హిందీ'' అన్నారు.
 
హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. ప్రేక్షకులందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. ప్రేక్షకుల వలనే ఈ అద్భుత విజయం సాధ్యపడింది. సినిమా గురించి చాలా వేదికల్లో మాట్లాడను. ఇప్పుడు సినిమా మీ ముందు వుంది కాబట్టి ఇకపై మీరు ముందుకు తీసుకెల్తారు. అది చాలు మాకు. మమ్మల్ని నమ్మి, ఇంత గొప్పగా ఆదరించిన  ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు'' తెలిపారు.
 
నిర్మాత్ర నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... చాలా రోజుల తర్వాత 50 రోజుల పండగ హనుమాన్ సినిమాతో జరుపుకోవడం చాలా అనందంగా వుంది.  ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మొదటి సినిమానే ఇంత పడ్డ విజయం సాధించడం సంతోషంగా వుంది. ఇది కేవలం ఒక శాతం మాత్రం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇంకా అద్భుతమైన చిత్రాలు రాబోతున్నాయి. మా సినిమాని మీడియా చాలా సపోర్ట్ చేసింది.  తేజ సజ్జా చాలా నమ్మకంతో అంకిత భావంతో సినిమా చేశారు.  మా సినిమాలో పనిలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 50 రోజులు 150 థియేటర్స్ లో ఆడటం అంటే మాములు విషయం కాదు. మా డిస్ట్రిబ్యుటర్స్, ఎగ్జిబ్యుటర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రొడక్షన్ టీం అందరికీ స్పెషల్ థాంక్స్. చాలా హార్డ్ వర్క్ చేసిన సినిమా చేశాం. మా నుంచి రానున్న సినిమాలని కూడా ఇదే పాషన్ తో చేస్తాం. ప్రేక్షకులు కూడా ఇదే ఆదరణ చూపాలని కోరుకుంటున్నాం. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.