ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 6 మే 2024 (11:25 IST)

వూల్ఫ్ లో ఆకర్షణీయమైన లుక్ తో లక్మిరాయ్

Lakmirai
Lakmirai
ప్రభు దేవాతో కలిసి అనసూయ నటించిన చిత్రం వూల్ఫ్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవలే సోషల్ మీడియాలో విడుదలైంది. ఈ టీజర్ విడుదలవ్వడంతో సినిమా మీద ఒక్కసారిగా అంచనాలు పెరిగినట్టు అయింది. తాజాగా ఇందులో రాయ్ లక్మి కూడా నటిస్తుందని ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది.
 
మోడ్రన్ లుక్స్, వేరే గెటప్స్‌తో వింత మనుషుల్ని ఈ టీజర్‌లో చూపించారు మేకర్లు. ఇది రెండు కాలాలకు సంబంధించిన కథనా? లేక మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారా? అనేట్లుగా టీజర్ లో చూపించారు.  విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
 
ఈ మూవీకి అరుల్ విన్సెంట్ కెమెరామెన్‌గా పని చేశాడు. అమ్రిష్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. లారెన్స్ కిషోర్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు.