అతనితో ఫోనులో మాట్లాడిన జయలలిత... ఎవరితో.. ఎందుకోసం?
ముఖ్యమంత్రి జయలలిత ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బహిర్గతమైన వెంటనే అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో
ముఖ్యమంత్రి జయలలిత ఫోనులో మాట్లాడారు. ఈ విషయం బహిర్గతమైన వెంటనే అన్నాడీఎంకే శ్రేణులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా సెప్టెంబర్ 22వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరగా, అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యంపై రకరకాల వదంతులు వచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో ఆమెకు దేశ విదేశీ వైద్య నిపుణులు చికిత్స చేశారు.
ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న సీనియర్ మహిళా నేత విశాలాక్షి నెడుంజెళియన్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈమె ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలు. విశాలాక్షి మరణవార్త తెలుసుకున్న జయలలిత.. ఆమె కుమారుడు మదివాణన్ వెల్లడించారు. ఈ వార్త అన్నాడీఎంకే శ్రేణులను ఎంతగానో ఉత్సాహపరిచింది