ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : గురువారం, 7 జులై 2016 (14:51 IST)

స్మృతీ ఇరానీ శరీరాన్ని పూర్తి కప్పుకునేందు ఆ పదవి సహకరిస్తుంది... అలీ షాకింగ్ కామెంట్స్

కేంద్ర మాజీ మానవ వనరుల శాఖామంత్రి, తాజా చేనేత జౌళి శాఖామంత్రి స్మృతీ ఇరానీపై విమర్శనాత్మక కామెంట్లు చేయడంలో కొందరు నాయకులు మాత్రం తమ నోటికి పని చెబుతూనే ఉన్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు, జనతాదళ్ (యు) న

కేంద్ర మాజీ మానవ వనరుల శాఖామంత్రి, తాజా చేనేత జౌళి శాఖామంత్రి స్మృతీ ఇరానీపై విమర్శనాత్మక కామెంట్లు చేయడంలో కొందరు నాయకులు మాత్రం తమ నోటికి పని చెబుతూనే ఉన్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు, జనతాదళ్ (యు) నేత అలీ అన్వర్ చేసి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అతడు చేసిన కామెంట్లపై అంతా మండిపడుతున్నారు. 
 
స్మృతీ ఇరానీకి కేటాయించిన శాఖపై స్పందించమని ఓ న్యూస్ చానల్ విలేకరి అడుగగా ఆయన చెపుతూ..."చేనేత శాఖకు ఆమె మంత్రిగా ఎంపిక కావడం చాలా సంతోషం. తన శరీరాన్ని పూర్తిగా కప్పుకునేందుకు ఆ పదవి ఆమెకు బాగా సహకరిస్తుంది" అని సంచలన వ్యాఖ్య చేశారు అలీ అన్వర్. అలీ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో మళ్లీ ఆయన సర్దుకుంటూ తను సాధారణ ప్రజల దుస్తుల అవసరాలను ఉద్దేశించి మాట్లాడినట్లు చెప్పుకున్నారు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఇప్పటికీ దుమారం అలాగే సాగుతోంది మరి.