శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 23 జులై 2020 (09:59 IST)

బీజేపీలో చేరిక.. అంతలోనే రాజకీయాలకు బైబై..ఎవరు?

బీజేపీలో చేరిన 24 గంటల్లోనే రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు భారత్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ మాజీ ఆటగాడు మెహతాబ్‌ హుస్సేన్‌.

తన వ్యక్తిగత కారణాల రీత్యానే రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని, ఎవరి ఒత్తిడి లేదని చెప్పారు. బీజేపీలో చేరాలన్న తన నిర్ణయం కారణంగా బాధపడ్డ తన బంధువులకు, స్నేహితులందరికీ క్షమాపణలు చెప్పాడు.

తన భార్య, పిల్లలు కూడా రాజకీయాల్లో చేరాలన్న తన నిర్ణయాన్ని అంగీకరించలేదని చెప్పారు. ఈరోజు నుండి తనకు ఏ పార్టీతోని సంబంధం లేదని ఈస్ట్‌ బెంగాల్‌ మాజీ కెప్టెనయిన మెహతాబ్‌ చెప్పారు.

మంగళవారం నాడు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.