శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 నవంబరు 2016 (09:25 IST)

అమ్మ కోసం చేసిన పూజలు ఫలించాయ్.. జయలలిత పూర్తిగా కోలుకున్నారు..

తమిళనాడు సీఎం జయలలిత పూర్తిగా కోలుకున్నారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ సెప్టెంబరు 22న ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా గత న

తమిళనాడు సీఎం జయలలిత పూర్తిగా కోలుకున్నారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. తీవ్రజ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ సెప్టెంబరు 22న ముఖ్యమంత్రి జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా గత నెల 21న వైద్యులు చివరి సారిగా జయ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఏఐఏడీఎంకే వర్గాలు వెల్లడించాయి. 
 
త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో సీఎం పగ్గాలు చేపడతారని పార్టీ అధికార ప్రతినిధి పన్‌రుట్టి ఎస్.రామచంద్రన్ పేర్కొన్నారు. సెప్టెంబరు 22న అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత పూర్తిగా కోలుకున్నారన్నారు. పేదల సేవకు త్వరలోనే మళ్లీ వస్తారని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు. అమ్మకోసం ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించాయన్నారు. కబడ్డీ ప్లేయర్ చేరలతన్, అందాల తార నమిత, అలనాటి తార సరోజా దేవి అమ్మను ఆస్పత్రిలో పరామర్శించిన సంగతి తెలిసిందే.