కర్నాటక ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఆ తొమ్మిది మంది ఎవరు?
కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప తన పదవికి సోమవారం రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన రాజీనామాపై గవర్నర్ తక్షణం ఆమోదముద్రవేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని యడ్యూరప్పను గవర్నర్ కోరారు.
ఇదిలావుంటే, యడ్యూరప్ప రాజీనామా నేపథ్యంలో కొత్త సీఎం ఎంపికపై భాజపా కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం కేంద్ర నాయకత్వం తరపున ఓ పరిశీలకుడిని కర్ణాటకకు పంపనుంది. పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చర్చించుకుని.. యడ్డీ వారసుడిపై ఓ నిర్ణయానికి రానున్నారు.
రాష్ట్రంలో భాజపా సర్కారు రెండేళ్లు పూర్తి చేసుకున్న రోజే సీఎం పీఠం నుంచి ఆయన వైదొలిగారు. దీంతో కర్ణాటకలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాషాయ పార్టీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది.
అయితే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువ నేతకు పగ్గాలు అప్పజెప్పాలని భాజపా భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం కేంద్ర నాయకత్వం తరఫున ఓ పరిశీలకుడిని కర్ణాటకకు పంపనుంది. పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చర్చించుకుని.. యడ్డీ వారసుడిపై ఓ నిర్ణయానికి రానున్నారు.