బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (11:16 IST)

ప్రియురాలిపై కన్నేసిన యజమాని.. చంపేసిన ప్రియుడు..

తాను ప్రేమిస్తున్న యువతిపై ఓ కంప్యూటర్ సెంటర్ యజమాన్ని కన్నేశాడనీ ఆ యువతి ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆ కంప్యూటర్ యజమానిని చంపేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరుకు చెందిన ముకుందన్ అనే వ్యక్తి నగరంలో ఓ కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నాడు. ఇందులో ఇక్కడ ఓ యువతి పని చేస్తూ వచ్చింది. ఆ యువతిపై ముకుందన్ మనసుపడ్డాడు. ఆమె మనస్సు గెలుచుకుని పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆమె అంగీకరకపోవడంతో పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. 
 
అదేసమయంలో ఆ యువతికి అప్పటికే రాజేంద్ర ప్రసాద్ అనే యువకుడుతో ప్రేమలోపడింది. యజమాని వేధింపులు తాళలేక పనిమానేసింది. అయినప్పటికీ అతను ఫోన్ చేసి వేధించసాగాడు. దీంతో తన ప్రియురాలి సలహాతో ముకుందన్‌ను మెల్విన్ అనే స్నేహితుడి సాయంతో రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్‌ 28న హత్య చేశాడు. అండర్‌సన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. యువతి పరారీలో ఉంది.