కర్ణాటకలో మోగిన ఎన్నికల నగారా: మే 10న పోలింగ్, మే 13న ఫలితాలు
కర్ణాటకలో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా మే 10వ తేదీన పోలింగ్ జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేస్తారు. కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం ఏర్పాటుకు 113 స్థానాల సంఖ్య అవసరం.
ప్రస్తుతం బీజేపీ రాష్ట్రంలో అధికారంలో వుంది. మే 24తో అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో 119 బీజేపీ ఎమ్మెల్యేలు, 75 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 28 జేడీఎస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారు.