గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 మార్చి 2023 (16:30 IST)

Ugadi 2023: కొత్త బట్టలు, దానాలు చేయడం మరిచిపోకూడదు..

చైత్ర నవరాత్రుల మొదటి రోజు ఉగాది దేశవ్యాప్తంగా చాలా వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రజలు ఉగాదిగా జరుపుకుంటారు. మార్చి 22, బుధవారం నాడు జరుపుకుంటారు.  
 
ఉగాది లేదా యుగాది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో నూతన సంవత్సర ప్రారంభంగా జరుపుకుంటారు. ఈ రోజున బ్రహ్మ దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడని నమ్ముతారు. 12వ శతాబ్దంలో భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్య ఉగాదిని కొత్త సంవత్సరం ఆరంభంగా గుర్తించారు. 
 
ప్రజలు తమ ప్రియమైనవారి కోసం కొత్త బట్టలు కొనుగోలు చేయడం, దానం చేయడం, ప్రత్యేక వంటకాలు సిద్ధం చేయడం, ప్రార్థనలు చేయడానికి దేవాలయాలను సందర్శిస్తారు.