శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (23:39 IST)

అమలకి ఏకాదశి... ఉసిరికాయతో పూజ... ఉసిరి చెట్టుకు (video)

Lord Vishnu
అమలకి ఏకాదశి మార్చి 3వ తేదీన వస్తోంది. ఈ రోజున ఉసిరికాయకు విశేష ప్రాధాన్యత వుంది. అమలకీ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల తీర్థయాత్రల పుణ్యం, సకల యాగాల పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శ్రీ హరి విష్ణువుకు ఉసిరికాయను సమర్పించి పంచోపచారాలతో పూజిస్తారు. 
 
ఈ రోజున, ఉసిరికాయను నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అనారోగ్యాలు తొలగిపోతాయి. రంగభారీ ఏకాదశి అని పిలువబడే ఈ ఏకాదశి మార్చి 3, 2023 శుక్రవారం అవుతుంది. 
 
అమలకి ఏకాదశి పూజా విధానం:-
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానాదికాలు పూర్తి చేసిన తర్వాత.. వత్రాన్ని సంకల్పించుకోవాలి. శ్రీహరిని పూజించాలి. పళ్ళెంలో పసుపు, కుంకుమ, అక్షితలు, ధూపం, దీపం మొదలైన వాటిని సిద్ధం చేసుకోవాలి. 
 
శుభ్రమైన పీటపై పసుపు గుడ్డను పరచి దానిపై విష్ణుమూర్తి చిత్రాన్ని లేదా విగ్రహాన్ని ఉంచాలి. ధూపం, నెయ్యితో దీపం వెలిగించి.. ఐదు రకాల పండ్లను, పువ్వులతో పూజించాలి. నెయ్యి దీపం వెలిగించి విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.
 
ఉసిరి పండును విష్ణువుకు ప్రసాదంగా సమర్పించాలి. వీలైతే.. ఉసిరి చెట్టుకు ధూపం, దీపం, గంధం, పువ్వులు, అక్షతలు మొదలైన వాటితో పూజించాలి.   
 
మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు, స్నానం చేసి, విష్ణువును పూజించిన తర్వాత, బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి.