మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఆగస్టు 2020 (12:49 IST)

మంటల్లో ప్రైవేట్‌ బస్సు.. ఐదుగురు సజీవ దహనం.. ఎక్కడ?

కర్నాటకలోని చిత్రదుర్గ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. విజయపుర నుండి 32 మంది ప్రయాణికులతో బెంగళూరు వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

నాలుగో నంబరు జాతీయ రహదారిపై హరియూర్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమవగా, మిగిలిన వారికి గాయాలయ్యాయి.

మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. ఇంజిన్‌లో లోపం వల్లే బస్సులో మంటలు చెలరేగినట్టు హరియూర్‌ ఎస్‌పి వెల్లడించారు.