గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2024 (23:11 IST)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్... అప్రజాస్వామికం : కేరళ అసెంబ్లీ తీర్మానం

[inarayi vijayan
ఒకే దేశం ఒకే ఎన్నిక (వన్ నేషన్ - వన్ ఎలక్షన్) ప్రతిపాదనకు కేరళ రాష్ట్రం మోకాలొడ్డింది. కేంద్రం ప్రతిపాదించిన ఈ ప్రణాళికకు వ్యతిరేకంగా కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఓ తీర్మానం చేసింది. ఈ తీర్మాన ప్రతిని కేంద్రానికి పంపించింది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ అప్రజాస్వామికమని స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. 
 
ఈ ప్రతిపాదన దేశంలోని సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని తీర్మానంలో పేర్కొంది. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ ద్వారా దేశంలోని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ వైవిధ్యాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందన్నారు. 
 
ఖర్చులను తగ్గించడానికి సులభతరమైన పాలనను నిర్ధారించడానికి సులభ మార్గాలను ఉన్నాయని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రధానమైన సమాఖ్య, నిర్మాణాన్ని నాశనం చేయడం, ప్రజల హక్కులను సవాల్ చేయం, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక స్వపరిపాలన హక్కులను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉందని విమర్శించారు.