సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2024 (22:00 IST)

కేరళ సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఏమైందంటే? (video)

Kerala CM
Kerala CM
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వాహనాలు ప్రమాదానికి గురైయ్యాయి. పినరయి విజయన్ ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో...  ముఖ్యమంత్రి వాహనం కూడా స్వల్పంగా దెబ్బతింది. అయితే, సీఎంకు గాయాలేమీతో బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 
 
అనంతరం ఎలాంటి జాప్యం లేకుండా ముఖ్యమంత్రి తన ప్రయాణం కొనసాగించారు. కేరళ తిరువనంతపురంలోని వామనపురంలో ఈ ఘటన జరిగింది.
 
రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. కాగా, సీఎం కాన్వాయ్‌కు చెందిన వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొనడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.