శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (18:36 IST)

పదేళ్ల పాటు ఉపయోగించవచ్చు.. మహిళలకు ఉచితంగా ఐదువేల మెన్‌స్ట్రువల్ కప్స్

కేరళ సర్కారు మహిళలకు పదేళ్ల పాటు ఉపయోగించే ఐదువేల మెన్‌స్ట్రువల్ కప్‌లను ఉచితంగా అందజేయనుంది. గత ఏడాది కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో.. వరద బాధితులను శిబిరాల్లో వుంచిన కేరళ సర్కారు.. మహిళలు నెలసరి సమయాల్లో ఉపయోగించే నాప్‌కిన్స్‌కు బదులు మెన్‌స్ట్రువల్ కప్‌‌లను అందజేయనుంది. 


మెన్‌స్ట్రువల్ కప్‌లను ఉపయోగించిన మహిళలు నాప్‌కిన్స్ కంటే ఇవి మరింత ఉపయోగకరంగా, సౌకర్యవంతంగా వున్నట్లు తెలిపారు. దీంతో కేరళ కార్పొరేషన్ ఆళప్పులాలోని ఐదువేల మహిళలకు ఉచితంగా మెన్‌స్ట్రువల్ కప్‌‌లను అందజేయనున్నారు.
 
దీనిపై కేరళ మున్సిపల్ కార్యదర్శి ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. కేరళ వరద బాధితుల శిబిరాల్లో బస చేసిన మహిళల ద్వారా మెన్‌స్ట్రువల్ కప్‌లకు సానుకూల స్పందన వచ్చింది. దీని ఆధారంగా తొలి విడతగా ఆళప్పులాలో ఐదువేల మెన్‌స్ట్రువల్ కప్‌లను మహిళలకు ఉచితంగా అందజేసే ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ప్రాజెక్టులో కేరళ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు సీఎస్ఆర్ ఇంటియేటివ్ ఆఫ్ కోలా ఇండియా లిమిటెట్ అనే సంస్థ నిధుల సాయం చేస్తుందని చెప్పారు. 
 
ఇంకా మహిళలు నెలసరి సమయాల్లో నానా తంటాలు పడుతుంటారు. నాప్‌కిన్‌ల కోసం ఏడాదికి రూ.600 వరకు ఖర్చు చేస్తున్నారు. ఆ మొత్తం పదేళ్లకు రూ.6వేలకు చేరుతుంది. కానీ నాప్‌కిన్‌లకు బదులు ఉపయోగించే మెన్‌స్ట్రువల్ కప్‌ల ధర రూ.2వేలని కేరళ మున్సిపల్ కార్పొరేషన్‌ అధికారి తెలిపారు.
 
అయితే ఈ కప్‌ను పదేళ్ల పాటు ఉపయోగించవచ్చు. నాప్‌కిన్‌ల కంటే ధర ఎక్కువైనప్పటికీ.. మెన్‌స్ట్రువల్ కప్‌‌లను ఒక్కసారి కొంటే పదేళ్ల వరకు వాడుకోవచ్చునని చెప్పారు. ఇంకా దీనిని ఉపయోగించి రెండు గంటలకు ఓసారి శుభ్రం చేసుకుని మళ్లీ వాడుకోవచ్చునని.. ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ వుండవని ఆయన చెప్పుకొచ్చారు.