శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శనివారం, 8 జూన్ 2019 (18:30 IST)

కేరళలో ఉరుములు, పిడుగులు... నత్తలా నడుచుకుంటూ రుతు పవనాలు...

నత్తలా నడుచుకుంటూ వస్తున్నాయి నైరుతి రుతు పవనాలు. తెలుగు రాష్ట్రాల్లోకి 8న వస్తాయనుకుంటే ఇవాళే కేరళ రాష్ట్రాన్ని తాకాయి. వేసవి ఎండలకు కిందామీదు అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు మరో మూడు రోజుల పాటు ఎదురుచూడాల్సిందే. 
 
తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నెల 11న రాయలసీమ మీదుగా ఏపీలోకి రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత 13 నుంచి 15 మధ్య తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళలో అప్పట్లో వర్షాలు బీభత్సం సృష్టించిన నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది.