ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 సెప్టెంబరు 2024 (08:56 IST)

కేరళలో వెలుగు చూసిన మరో మంకీ పాక్స్ కేసు... భారత్‌లో మూడు

mpox case
ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీ పాక్స్ వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. ఆఫ్రికా దేశాల నుంచి పలు ప్రపంచ దేశాలకు వ్యాపించిన ఈ వైరస్.. ఇటీవలే భారత్‌లోకి అడుుపెట్టింది. ఇప్పటికే రెండు మంకీపాక్స్ కేసులు నమోదు కాగా, తాజాగా మరో కేసు నమోదైంది. దీంతో భారత్‌లో మొత్తం నమోదైన మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. 
 
తాజాగా కేరళోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, అతడి నమూనాలు పాజిటివ్‌గా తేలాయి. దీంతో భారత్‍‌లో మంకీపాక్స్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. మన దేశంలో ఈ నెల 9వ తేదీన తొలి మంకీపాక్స్ కేసు నమోదు కాగా, ఈ నెల 18వ తేదీన మరో మంకీపాక్స్ కేసు నమోదైన విషయం తెల్సిందే. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 122 దేశాల్లో 99518 మంకీపాక్స్ కేసులు నమోదైవున్నాయి. ఆఫ్రికా దేశాల్లో ఈ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నమాయి. దీంతో పలు ఆఫ్రికా దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. భారత వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మంకీపాక్స్ లక్షణాలు.. జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, కాళ్లు చేతుల్లో దురద, పొక్కులు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తితో సన్నిహితంగా మెలగడం, వారు  ఉపయోగించే వస్తువులు ముట్టుకోవడం వల్ల ఈ వ్యాధి మరొకరికి సంక్రమిస్తుందని తెలిపారు.