బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (11:57 IST)

భాజపాకు ఇక నిద్ర లేని రాత్రులేనట... ఖుష్బూ ట్వీట్

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో భాజపా విజయకేతనం ఎగురవేసే దిశగా సాగుతోంది. గుజరాత్ మొత్తం 182 స్థానాలకు గాను భాజపా 105 చోట్ల ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 74 చోట్ల ఆధిక్యంలో వుండగా 3 చోట్ల ఇతరు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో భాజపా విజయకేతనం ఎగురవేసే దిశగా సాగుతోంది. గుజరాత్ మొత్తం 182 స్థానాలకు గాను భాజపా 105 చోట్ల ఆధిక్యతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 74 చోట్ల ఆధిక్యంలో వుండగా 3 చోట్ల ఇతరులు వున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సర్కారు నుంచి భాజపా అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా సాగుతోంది. అక్కడ మొత్తం 68 స్థానాలకు గాను భాజపా 46, కాంగ్రెస్ పార్టీ 18 చోట్ల, ఇతరులు 4 చోట్ల ఆధిక్యంలో వున్నారు. 
 
ఇదిలావుంటే తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీ నటి ఖుష్బూ మాత్రం భాజపాకు నిద్రలేని రాత్రులు మొదలయ్యాయంటూ ట్వీట్ చేశారు. మరి ఈమె ట్వీట్ పైన ఎలాంటి స్పందనలు వస్తాయో చూడాలి.