మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (13:51 IST)

ఇదీ అన్నా లైఫ్ అంటే... గుండు తుడిచేందుకు ఓ పనిమనిషి!! (Video)

kiran kumar
డబ్బులు ఎవరికీ ఊరికే రావు అనే డైలాగుతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా దేశ వ్యాప్తంగా బాగా ఫేమస్ అయిన వ్యక్తి కిరణ్ కుమార్ అలియాస్ గుండు బాస్. ప్రముఖ నగల దుకాణం లలితా జ్యూవెలర్స్ అధినేత. కోటీశ్వరుడు. మిగిలిన జ్యూవెలర్స్ షాపుల తరహాలో కాకుండా మార్కెట్‌ ప్రచారాన్ని తన టాలెంట్‌తో కొత్త పుంతలు తొక్కించారు. తమ దుకాణానికి సంబంధించిన అన్ని ప్రచార యాడ్‌లలో ఆయన కనిపిస్తారు. అలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
అయితే, ఈ వీడియో ఎపుడు, ఎక్కడ తీశారన్నది తెలియరాలేదు కానీ, ఓ ఫంక్షన్‌కు హాజరైన కిరణ్ కుమార్‌ హాజరై, తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో మాట్లాడుతుండటం ఈ వీడియోలో కనిపించింది. వెనుక ఉన్న వ్యక్తిగత  సిబ్బంది చిన్నపాటి తెల్లటి టవల్‌తో కిరణ్ కుమార్ గుండుకు పట్టిన చెమటను ఎప్పటికపుడు తుడుస్తూ కనిపించాడు. పైగా, కిరణ్ కుమార్ గుండుకు పట్టే చెమటను తుడవడమే తన పని అన్నట్టుగా ఆ సిబ్బంది వ్యవహరించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ, తమకు తోచిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 
 
నాని అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ, 'జీవితంలో ఎంత సంపాదించాలంటే... ఇదిగో ఇలా గుండుకు పట్టిన చెమటను తుడిచేందుకు ఓ ఉద్యోగిని పెట్టుకునేంతగా' అనే క్యాప్షన్ పెట్టాడు. ఈ క్యాప్షన్‌కు తోడు గుండు బాస్ చెమట తుడుస్తున్న దృశ్యాలను చూసి నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. 
 
ఈ వీడియోకు చాలా మంది నవ్వుతున్న ఎమోజీలను, మరికొందరు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదీ అన్నా లైఫ్ అంటే.. అని ఒకరు, ఆ ఉద్యోగం నాకిప్పించండి అని మరొకరు, డిఫరెంట్ హెయిల్ స్టైల్ కంటే గుండును మెయింటెన్ చేయడమే చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటూ ఇంకొక నెటిజన్ కామెంట్స్ చేశారు.