శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (17:36 IST)

పింఛన్ సొమ్ముకు కక్కుర్తిపడి... తల్లి శవాన్ని మూడేళ్లు దాచాడు.. ఎక్కడ?

కన్నతల్లి మృతిని కూడా క్యాష్ చేసుకోవాలని భావించాడో ప్రబుద్ధుడు. తల్లి మరణాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా ఆమె శవంతో లక్షాధికారి కావాలనుకున్నాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఓ దారుణ సంఘటన త

కన్నతల్లి మృతిని కూడా క్యాష్ చేసుకోవాలని భావించాడో ప్రబుద్ధుడు. తల్లి మరణాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా ఆమె శవంతో లక్షాధికారి కావాలనుకున్నాడు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన ఓ దారుణ సంఘటన తాజాగ వెలుగులోకి వచ్చింది.
 
కోల్‌కతాలోని బెహాలా ప్రాంతానికి చెందిన బీనా మజుందార్‌ అనే మహిళ ఎఫ్.సి.ఐ మాజీ ఉద్యోగిని. ఈమెకు భర్త గోపాల్, కొడుకు సువవ్రతా మజుందార్ ఉన్నారు. ఈమె రెండేళ్ళ క్రితం అనారోగ్యంతో చనిపోయింది. ఈ విషయం బయటకు పొక్కనీయలేదు. పైగా, తల్లి మరణాన్ని క్యాష్ చేసుకోవాలని కుమారుడు ప్లాన్ వేశాడు. ఇందుకోసం తల్లికి అంత్యక్రియలు జరుపకుండా మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. మృతదేహం పాడవకుండా రసాయనాలు ఉపయోగించాడు. ఇలా రెండేళ్ల సమయం గడిచిపోయింది. దీంతో ఇరుగుపొరుగువారికి సందేహం వచ్చి, పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... సువవ్రతా ఇంట్లో తనిఖీలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న ఓ డీప్‌ ఫ్రీజర్‌‌ను గుర్తించిన పోలీసులు దాన్ని తెరిచి చూడగా బీనా మృతదేహం కన్పించింది. దీంతో పోలీసులు విస్తుపోయారు. పైగా, ఫోర్జరీ చేసిన కొన్ని పత్రాలకు కూడా స్వాధీనం చేసుకొన్నారు. రిటైర్ అయిన తర్వాత బీనాకు నెలకు రూ.50 వేల పింఛను వచ్చేది. అయితే బీనా చనిపోయినప్పటి నుంచి ఆమె వేలి ముద్రలు తీసుకుంటూ రెండేళ్లుగా సువవ్రతా ఆ పింఛను సొమ్మును వాడుకుంటున్నట్టు తేలింది. 
 
బీనా మృతదేహాన్ని భద్రపరిచిన విషయం తనకు తెలుసునని, కొడుకు సూచనల మేరకే తాను ఈ విషయం పోలీసులకు చెప్పలేదని గోపాల్‌ విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, వీరిపై కేసు నమోదు చేసి పూర్తి వివరాలను రాబట్టేందుకు విచారణ జరుపుతున్నారు.