మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (15:41 IST)

ఫుడ్ కోర్టుల్లో సెక్స్ వర్కర్ల సేవలు... ఎక్కడ?

ఫుడ్ కోర్టుల్లో సెక్స్ వర్కర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదీ కూడా ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాలోనే. ఇంతకీ సెక్స్ వర్కర్ల వ్యవహారాన్ని పరిశీలిస్తే...

ఫుడ్ కోర్టుల్లో సెక్స్ వర్కర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదీ కూడా ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాలోనే. ఇంతకీ సెక్స్ వర్కర్ల వ్యవహారాన్ని పరిశీలిస్తే... 
 
వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఆసియాలోనే రెడ్ లైట్ ఏరియా ఉంది. ఈ ఏరియాలో వందలాది మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. అయితే, దసరా పండగ నేపథ్యంలో కోల్‌కతాలో దుర్గా నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తుండటం ఆనవాయతి. ఈ సందర్భంగా మత్స్యశాఖ ప్రతి యేటా ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేస్తుంది. ఈ ఫుడ్ కోర్టుల్లో సెక్స్ వర్కర్లు చెఫ్‌లుగా సెక్స్ వర్కర్లు పనిచేయనున్నారు. 
 
ఈ విషయాన్ని ఫిషరీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ సౌమ్యజిత్ తెలిపారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, సెక్స్ వర్కర్లకు ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించి వారి అభివృద్ధికి పాటుపడుతున్న దర్బార్ మహిళా సమన్వయ కమిటీ (డీఎంఎస్సీ), ఎన్జీవో సంస్థలు ఇందుకు సంబంధించిన ప్రాజెక్టుపై తమతో ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు.
 
ఈ మేరకు సెక్స్ వర్కర్లను చెఫ్‌లుగా తీర్చిదిద్దేందుకు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. డీఎంఎస్సీలో రిజిస్టర్ అయిన సెక్స్ వర్కర్ల సంఖ్య 1.3 లక్షల మంది. దుర్గా పూజల సమయంలో కోల్‌కతాలోని ఎనిమిది ప్రాంతాల్లో, బెంగళూరులోని రెండు చోట్ల ఫుడ్ పెవిలియన్స్ ఏర్పాటు చేయనున్నట్టు ఫిషరీస్ కార్పొరేషన్ డెవలప్ మెంట్ అధికారులు తెలిపారు.