శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జనవరి 2017 (19:01 IST)

ఒక్క రోజైనా గడపమన్నాడు.. నో చెప్పడంతో నెట్లో ఫోటోను యాడ్ చేశాడు.. 100 కాల్స్ వచ్చాయ్

భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమె వైద్యురాలు. రెండో వివాహం చేసుకుందామని తల్లిదండ్రుల కోరిక మేరకు మాట్రిమోనీలో ప్రొఫైల్ పోస్టు చేసింది. ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి పెళ్లాడతానని చెప్పాడు. కానీ తల్లిదండ్ర

భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆమె వైద్యురాలు. రెండో వివాహం చేసుకుందామని తల్లిదండ్రుల కోరిక మేరకు మాట్రిమోనీలో ప్రొఫైల్ పోస్టు చేసింది. ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి పెళ్లాడతానని చెప్పాడు. కానీ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో అతడిని నిరాకరించింది. అయినా ఆ దుర్మార్గుడు వదల్లేదు. వైద్యురాలిని తీవ్ర వేధింపులకు గురిచేశాడు. బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన ఓ మహిళ ఆస్పత్రిలో డెంటిస్టుగా పనిచేస్తోంది. భర్తతో విభేదాల కారణంగా అతడి నుంచి విడిపోయి, తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమెకు సంతానం లేరు. దీంతో రెండో వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. దీంతో ఓ మాట్రిమోనీ కంపెనీ వెబ్‌సైట్లో తన ఫోటో వివరాలను ఉంచింది. ఆ వివరాలు చూసిన సంజీవ్ అనే వ్యక్తి ఆమెతో ఫోన్‌లో మాట్లాడాడు. తన తల్లిదండ్రులతో మాట్లాడి అభిప్రాయం చెబుతానని మహిళ చెప్పింది. అతని ప్రొఫైల్ పరిశీలించిన కుటుంబ సభ్యులు సరిజోడి కాదని తేల్చేశారు.
 
సదరు మహిళ కూడా సంజీవ్‌కు నో చెప్పింది. ఆపై సంజీవ్ ఆమెను వేధించడం మొదలెట్టాడు. కనీసం ఫ్రెండ్స్‌గానైనా ఉందాం అంటూ మహిళపై ఒత్తిడి చేశాడు. దీంతో అసలు ఉద్దేశమేంటని సంజీవ్‌ను మహిళ ప్రశ్నించింది. పెళ్లి ఎలాగో చేసుకోవడం లేదు కదా కనీసం ఒక్క రోజైనా తనతో గడపాలని సంజీవ్ నీచంగా మాట్లాడాడు. ఫోనులో ఎంత హెచ్చరించినా వాడి వాలకం మారలేదు. 
 
అంతటితో ఆగకుండా సదరు మహిళ ఫోటోను జతచేసి, శృంగారంపై ఆసక్తి ఉన్న మగవారు ఈమెను సంప్రదించడంటూ నెట్‌లో వివరాలతో కూడిన ఫోటోను యాడ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఆమెకు దాదాపు వందల మంది ఫోన్ చేసి విసిగించడం మొదలుపెట్టారు. వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు జరిపిన పోలీసులు.. దీనంతటికి కారణంగా సంజీవ్ అని తేల్చారు. వెంటనే అతడ్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. నిందితుడ్ని జైలుకు పంపారు.