సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

విడాకుల కేసులో న్యాయం జరగలేదనీ జడ్జి కారు అద్దాలు పగులగొట్టిన బాధితుడు

car vandalizes
విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి .. ఈ కేసులో తీర్పునిచ్చిన ఫ్యామిలీ కోర్టు జడ్జి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని పథనంతిట్ట జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి న్యాయమూర్తి కారుపై తన అక్రోశం వెళ్లగక్కాడు. కోర్టు ఆవరణలోనే నిలిపివుంచిన కారు అద్దాలను ధ్వంసం చేశాడు. కారుకు సొట్టలు పడేలా చేశాడు. తిరువళ్లా కోర్టు వద్ద బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
ఈ కేసు గత ఆరేళ్లుగా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. భార్యే అతడిపై విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. అయితే, న్యాయవాది, జడ్జి కుమ్మక్కై తన గోడు సరిగా ఆలకించలేదని పేర్కొంటూ కోపోద్రిక్తుడయ్యాడు అని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కేసులో కారు అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.