25 యేళ్ళనాటి సమస్యకు పరిష్కారం చూపిన లాక్డౌన్!!

బుధవారం, 27 మే 2020 (09:19 IST)
దేశంలో వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వీటిని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వాహన రాకపోకలపై అనేక రకాలైన ఆంక్షలు విధిస్తున్నారు. అలాగే, జల కాలుష్య నివారణకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఈ జల కాలుష్యం కారణంగా చెరువులు, నదులు, ఉప నదులు, ఇలా అన్నీ కలుషితమై పోతున్నాయి. ప్రధానంగా దేశానికి ప్రధాన జీవనాధారంగా ఉండే కీలక నదులు కూడా ఈ కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. గంగా, యమున వంటి పవిత్ర నదుల ప్రక్షాళన కోసం కేంద్రం నడుం బిగించింది. అయినప్పటికీ.. రవ్వంత కూడా పురోగతి లేదు. 
 
ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం లాక్డౌన్ చేస్తోంది. గత రెండు నెలలకు పైగా ఈ లాక్డౌన్ అమల్లో ఉండటంతో దేశం మొత్తం స్తంభించిపోయింది. దీంతో దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న జల కాలుష్య సమస్యకు చక్కటి పరిష్కారం లభించింది. 
 
తాజాగా 25 సంవత్సరాలుగా కలుషితమైపోయిన యమునా నది.. ఇపుడు స్వచ్ఛంగా మారింది. ఈ నదిలో నీరు ప్రహిస్తున్నప్పటికీ అడుగు భాగం స్పష్టంగా తెలుస్తోందంటే.. జల కాలుష్యం ఏమేరకు తగ్గిపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఒక్క యమునా నది మాత్రమే కాదు.. అనేక నీటి నిల్వ కేంద్రాలు కూడా స్వచ్ఛంగా మారిపోయాయి. 

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments