శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 మే 2020 (10:35 IST)

ఏపీలో ప్రారంభమైన స్వదేశీ విమాన సర్వీసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన సర్వీసులు మళ్లీ మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చే విమాన ప్రయాణికులకు రాష్ట్ర  సర్కారు పలు ఆంక్షలు విధించింది. ముఖ్యంగా, వివిధ ప్రాంతాల్లో చిక్కుకునివున్న వారు స్వరాష్ట్రానికి వచ్చేందుకు ఈ విమాన సర్వీసులు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తోది. అదేసమయంలో పలు ఆంక్షలు విధించడంతో అనేక మంది ప్రయాణికులు స్వరాష్ట్రానికి వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. 
 
దేశీయ విమాన ప్రయాణికులకూ రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఎక్కువ కేసులు ఉన్న రాష్ట్రాల నుంచి వస్తే కరోనా లక్షణాలు లేకున్నా క్వారంటైన్‌ తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాష్ట్రప్రభుత్వ పోర్టల్‌ 'స్పందన'లో దరఖాస్తు చేసుకున్నాక రాష్ట్రానికి వచ్చేందుకు ఆమోదం లభిస్తేనే విమాన టిక్కెట్లు కొనుగోలు చేయాలని సూచించింది. 
 
అంతేగాకుండా ఎయిర్‌పోర్టులో దిగాక కరోనా వైరస్‌ లక్షణాలు గుర్తిస్తే వెంటనే ప్రభుత్వ క్వారంటైన్‌లో వారం రోజులు, హోమ్‌ క్వారంటైన్‌లో మరో వారం రోజులు తప్పనిసరని వెల్లండించింది. తక్కువ కేసులున్న రాష్ట్రాలనుంచి వచ్చేవారికి హోంక్వారంటైన్‌ తప్పనిసరని స్పష్టం చేసింది.